Friday 24 June 2011

మల్లెమాల "అమర గాయకుడు ఘంటసాల" మీద రాసిన పద్యం





మల్లెమాల "ఇదీ నా కధ" లో అమర గాయకుడు ఘంటసాల స్వర్గస్తుడైనప్పుడు జరిగిన విషయాలు ప్రస్తావిస్తూ ఘంటసాల సంతాప సభ కోసం రాసిన ఒక పద్యం....... 


                   ఎవని గానము  తెల్గుటెడదలన్నింటిని
         
               తీయందనాలలో తేలజేసే!

               ఎవని ముద్దుల నామ  మింటింట తారక

               మంత్రమై రేబవాల్ మారు మ్రోగె!

               ఎవని కమ్మని కంఠమెందరు నటులకో 

               గాత్రమై చిరకీర్తి కలుగ జేసే!       

               ఎవని చల్లని చేయి ఎన్నో కుటుంబాల 

               అన్నార్తి తొలగించి ఆదుకోనియే!

               అట్టి సౌజన్యమూర్తి మహా మనీషి

               క్రమ సంగీత  శాల శ్రీ ఘంటసాల 

               చనియె సురలోక మట గాన సభలు జరుప 

               తిరిగి రానిత్తురే వాని దివిజులింక!!


   

1 comment:

  1. ఈ పద్యాన్ని స్వర్గస్థులైన మల్లెమాల గారు రచించారని రవీంద్రభారతి లో ఓక ప్రోగ్రాం లో
    సిని జర్నలిస్ట్ తెలిపారు

    ReplyDelete