Friday 10 June 2011

వగల 'రాణి' 'రాజ' సులోచన






 సినిమా రంగంలో ఆ తరంలో చెప్పుకోదగ్గ నటి, నర్తకి శ్రీమతి రాజసులోచన.  1953 సం. లో "సొంత ఊరు " సినిమాతో ప్రారంభమైన ఆమె సిని ప్రస్థానం లో వివిధ రకాలైన పాత్రలలో  - వ్యాంప్ పాత్రల తో సహా - నటింఛి తెలుగు ప్రజల మన్నన పొందింది.  నటిగానే కాకుండా నర్తికిగా కూడా ఆమె పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంది.  ఆ రోజుల్లో  నటీమణులు అంజలి, సావిత్రి, జమున సినీ  రంగాన్ని ఏలుతున్నపుదు   కూడా ప్రముఖ హీరోలైన రామారావు, నాగేశ్వరరావు, కాంతారావు,  జగ్గయ్య ల సరసన హీరోయిన్ గా నటించి తన ప్రత్యేకత నిలుపుకుని శభాష్ అనిపించుకుంధీ
వగరు, పొగరు, పట్టుదల, కొంటెతనం  కలసిన పాత్రలకు ఆమె పెట్టింది పేరు. తమిళ, హిందీ రంగాలలో కూడా  బావుటా ఎగరేసిన తెలుగు నటి ఆమె.
      

దూరదర్శన్, హైదరాబాద్ కేంద్రానికి చెందిన శ్రీమతి విజయదుర్గ శ్రీమతి రాజసులోచనని చేసిన ఇంటర్వ్యూ రేపు శనివారం అంటే 11 వ తారీకున రాత్రి 8 గం. లకు మరియు సోమవారం ఉదయం 8.30 గం. లకు దూరదర్శన్ లో ప్రసారమవుతుంది. 

1 comment:

  1. నర్తకిగా రాజసులోచన...సప్తగిరిలో ఇప్పుడే చూసానండి. మీ పోస్ట్ ద్వారా ఇంత మంచి సమాచారం తెలుసుకున్నాను. చాలా చక్కటి క్లిప్పింగ్స్ చూడగలిగాను. థాంక్సండి.

    ReplyDelete