Friday 24 June 2011

మల్లెమాల "అమర గాయకుడు ఘంటసాల" మీద రాసిన పద్యం





మల్లెమాల "ఇదీ నా కధ" లో అమర గాయకుడు ఘంటసాల స్వర్గస్తుడైనప్పుడు జరిగిన విషయాలు ప్రస్తావిస్తూ ఘంటసాల సంతాప సభ కోసం రాసిన ఒక పద్యం....... 


                   ఎవని గానము  తెల్గుటెడదలన్నింటిని
         
               తీయందనాలలో తేలజేసే!

               ఎవని ముద్దుల నామ  మింటింట తారక

               మంత్రమై రేబవాల్ మారు మ్రోగె!

               ఎవని కమ్మని కంఠమెందరు నటులకో 

               గాత్రమై చిరకీర్తి కలుగ జేసే!       

               ఎవని చల్లని చేయి ఎన్నో కుటుంబాల 

               అన్నార్తి తొలగించి ఆదుకోనియే!

               అట్టి సౌజన్యమూర్తి మహా మనీషి

               క్రమ సంగీత  శాల శ్రీ ఘంటసాల 

               చనియె సురలోక మట గాన సభలు జరుప 

               తిరిగి రానిత్తురే వాని దివిజులింక!!


   

Sunday 19 June 2011

సంపూర్ణ చంద్రగ్రహణం - ఫొటోస్

15 వ తారికున సంభవించిన సంపూర్ణ చంద్రగ్రహణం - కొన్నిఫొటోస్  మీకోసం 
















Friday 10 June 2011

వగల 'రాణి' 'రాజ' సులోచన






 సినిమా రంగంలో ఆ తరంలో చెప్పుకోదగ్గ నటి, నర్తకి శ్రీమతి రాజసులోచన.  1953 సం. లో "సొంత ఊరు " సినిమాతో ప్రారంభమైన ఆమె సిని ప్రస్థానం లో వివిధ రకాలైన పాత్రలలో  - వ్యాంప్ పాత్రల తో సహా - నటింఛి తెలుగు ప్రజల మన్నన పొందింది.  నటిగానే కాకుండా నర్తికిగా కూడా ఆమె పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంది.  ఆ రోజుల్లో  నటీమణులు అంజలి, సావిత్రి, జమున సినీ  రంగాన్ని ఏలుతున్నపుదు   కూడా ప్రముఖ హీరోలైన రామారావు, నాగేశ్వరరావు, కాంతారావు,  జగ్గయ్య ల సరసన హీరోయిన్ గా నటించి తన ప్రత్యేకత నిలుపుకుని శభాష్ అనిపించుకుంధీ
వగరు, పొగరు, పట్టుదల, కొంటెతనం  కలసిన పాత్రలకు ఆమె పెట్టింది పేరు. తమిళ, హిందీ రంగాలలో కూడా  బావుటా ఎగరేసిన తెలుగు నటి ఆమె.
      

దూరదర్శన్, హైదరాబాద్ కేంద్రానికి చెందిన శ్రీమతి విజయదుర్గ శ్రీమతి రాజసులోచనని చేసిన ఇంటర్వ్యూ రేపు శనివారం అంటే 11 వ తారీకున రాత్రి 8 గం. లకు మరియు సోమవారం ఉదయం 8.30 గం. లకు దూరదర్శన్ లో ప్రసారమవుతుంది. 

Friday 3 June 2011

65/45 'బాలు'



తెలుగు చలనచిత్ర రంగంలో 45 సం. లు గా నేపధ్య గాయకుడుగా తనకంటూ ప్రత్చేక స్తానం కలిగి ఉన్న శ్రీ శ్రీపతి పండితరాద్యుల బాల సుబ్రహమణ్యం గారు 65 వ వసంతంలోకి (4th June) అడుగిడుతున్న సందర్భంగా  హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

"రావే కావ్యసుమబాల" అంటూ ప్రారంభించిన ఆ గళాన్ని ఆ కావ్యసుమబాల ఆశీర్వదించి బాలు గొంతు ద్వారా రకరకాల సాహిత్యం వెలువడేటట్టు చేసింది.

15 డిసెంబర్ 1966 లో ప్రారంభమైన ఈ ప్రస్తానం ఇంకా అవిశ్రాంతంగా సాగుతూనే ఉంది.

బాల సుబ్రహమణ్యం గారు చేసుకున్న అదృష్టం ఏమిటంటే ఆ తరం ఈ తరం సంగీత దర్శకుల దగ్గర పాడటం,  పాడి ప్రజలని మెప్పించగలగటం.

బాలుగారు వివిధ సంగీత దర్శకుల దర్సకత్వం పాడిన కొన్ని మంచి పాటలని సింహావలోకనం చేసుకుందాం.


తన గురువుగా భావించే కోదండపాణి SP పాడిన మంచి పాటలు:
1 మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసేనయ్య  - కధానాయకి మొల్ల (1970)
2 తనివి తీరలేదే  - గూడుపుఠాణి (1972)

మాస్టర్ వేణు 
1. కానరాని నీవే కనిపించినావే - మేలుకొలుపు (1978)
2. ఉరిమే మేఘములో   - మా ఇంటి దేవత (1980)

S రాజేశ్వరరావు గారు
1. ఈ రేయి తియ్యనిది - చిట్టిచెల్లెలు (1970)
2. ముత్యాలు వస్తావా - మనుషులంతా ఒక్కటే (1976)

రమేష్ నాయుడు 
1. శివరంజని నవరాగిణి - తూర్పు పడమర (1976)
2. సువ్వి కస్తూరి రంగా - చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)

రాజన్ - నాగేంద్ర
1. సిరిమల్లె నీవే విరిజల్లు కావే - పంతులమ్మ (1978)
2. మల్లెలుపూసె వెన్నెల కాచే - ఇంటింటి రామాయణం (1979)
సత్యం 
1. ఏ దివిలో విరిసిన పారిజాతమో - కన్నెవయసు (1973)
2. మధుమాస వేళలో మరుమల్లె తోటలో - అందమే ఆనందం (1977)

J.V రాఘవులు   
జననీ జన్మభూమిశ్చ - బొబ్బిలిపులి (1982 ) 

G.K. వెంకటేష్  
1 .రాసాను ప్రేమలేఖలెన్నో - శ్రీదేవి (1970)
2. రవివర్మకే అందని - రావణుడే రాముడైతే (1979)

ఆదినారాయణరావు
1. కలియుగం కలియుగం - భక్త తుకారాం 
2 . రగిలింది విప్లవాగ్ని ఈరోజు - అల్లూరి సీతారామరాజు 
పెండ్యాల నాగేశ్వరరావు
 1. మెరిసే మేఘమాలిక  - దీక్ష (1974)
 2. చిత్రం భళారే విచిత్రం - దానవీరశూరకర్ణ  (1977)

K. V. మహాదేవన్   
1. ఆడవే మయూరి నటనమాడవే -  చెల్లెలి కాపురం (1971)
2. దొరుకునా ఇటువంటి సేవ - శంకరాభరణం (1979 )

చక్రవర్తి 1. చీకటి వెలుగుల కౌగిలిలో - చీకటి వెలుగులు (1975)
2. ఆడవే అందాల సురభామిని - యమగోల (1977)

M.S. విశ్వనాథన్
1. జూనియర్ ఇటు అటు కాని  - ఇది కధ కాదు (1979)
2. కన్నెపిల్లవని కన్నులున్నవని - ఆకలి రాజ్యం (1981)
ఇళయరాజా
1. వేదం అణువణువున నాదం - సాగర సంగమం (1983)
2. తరలిరాదా తనే వసంతం - రుద్రవీణ (1988 )

కీరవాణి
1.   జామురాతిరి జాబిలమ్మ - క్షణ క్షణం (1991 )
2.  నిగమా నిగమాంత - అన్నమయ్య (1998)

AR రహేమాన్
నా చెలి రోజావే  - రోజా (1992)

తన స్వీయ దర్శకత్వంలో బాలు గారు పాడిన పాటలు
1 . చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మా - తూర్పు వెళ్ళే రైలు (1979)
2 . పిబరే రామ రసం - పడమటి సంధ్యారాగం (1986)

బాలుగారు పాడిన ప్రైవేటు అల్బుమ్స్ లో చెప్పుకో తగ్గవి ఆంధ్ర శివక్షేత్రాలు, రామ గానామృతం.  ఆయనవి ఇంకా చాలా ప్రైవేటు అల్బుమ్స్ ఉన్నాయి. 

ఇందులో చెప్పినవి నాకు బాగా నచ్చిన  కొన్ని పాటలని మాత్రమే. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. 

బాలుగారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు.